తన మిత్ర దేశాలకు భారత్ ఆపన్న హస్తం
కరోనా కాలంలో భారత్, తన మిత్ర దేశాలకు ఆపన్న హస్తం అందిస్తోంది. పొరుగున ఉన్న 5 చిన్న దేశాలకు ఆరోగ్య బృందాలను పంపించింది. మిషన్ సాగర్లో భాగంగా భారత యుద్దనౌక కేసరి, మాల్దీవులు, మారిషన్, మెడగాస్కర్, కొమొరోస్, సేచెల్స్, దేశాలకు వారి విజ్ఞప్తి మేరకు ఆరోగ్య బృందాలతో బయలుదేరిందని విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, ఇతర నిత్యావసర వస్తువులను కూడా తరలించినట్లు వెల్లడించింది. వీటితో పాటు మాల్దీవుల కోసం 600 టన్నుల ఆహారపదార్థాలను, మారిషన్ కోసం ఆయుర్వేద మందులను ప్రత్యేకంగా పంపినట్లు పేర్కొంది.






