మళ్లీ మనోళ్లే టాప్
స్వదేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు విషయంలో భారత్ మరోసారి అగ్రస్థానంలో నిలబడింది. 79 బిలియన్ డాలర్లతో గతేడాది ప్రథమ స్థానంలోనే నిలిచింది. తర్వాతి స్థానంలో చైనా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ తమ తాజా జాబితాలో పేర్కొన్నది. గత మూడేండ్లుగా భారత్కు వివిధ దేశాల్లోని ప్రవాసులు పంపిస్తున్న సొమ్ము క్రమేణా పెరుగుతుండటం విశేషం. 2016లో 62.7 బిలియన్ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు.. 2017లో 65.3 బిలియన్ డాలర్లను పంపారు. 2018లో 79 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో గతేడాదే దాదాపు 14 బిలియన్ డాలర్లు పెరిగినట్లైంది. ఇదిలావుంటే భీకర వరదలతో అతలాకుతలమైన కేరళకు రెమిటెస్సుల దన్ను లభించి ఉండవచ్చని, తమ వారికి ప్రవాసులు పెద్ద ఎత్తున సొమ్ము పంపించి ఉంటారని బ్యాంక్ అభిప్రాయపడింది.













