భారతీయులే టాప్
విదేశాల నుంచి స్వదేశానికి నిధులు పంపిస్తున్నవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు గతేడాది పంపించిన సొమ్ము దాదాపు 69 బిలియన్ డాలర్లు (రూ.4,48,500 కోట్లు)గా ఉన్నది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది. 2016లో 62.7 బిలియన్ డాలర్లు కాగా, 2015తో పోల్చితే ఇది 8.9 శాతం తక్కువే. అయితే 2017లో మళ్లీ 9.9 శాతం పెరిగిన నిధులు, 2014లో మాత్రం 70.4 బిలియన్ డాలర్లుఆ నమోదైనట్లు ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా సృష్టం చేసింది. ఇదిలావుంటే నిరుడు అల్పాదాయ, మధ్యస్త ఆదాయ దేశాల్లోకి ఆయా దేశస్తులు పంపిన సొమ్ము మొత్తం 466 బిలియన్ డాలర్లుగా ఉందని, అంతకుముందు ఏడాది ఇది 429 బిలియన్ డాలర్లకే పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ వివరించింది.













