అమెరికా-భారత్ మధ్య ఒప్పందాలు వేగవంతం
నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడంతో అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు వేగవంతమవుతాయని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు పరస్పరం పరిష్కరించుకునే అంశాలేమిటో బాగా తెలుసు అని అన్నారు. ఎన్నికలకు ముందు కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు భారత్కు అవరోధంగా మారాయని, అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగాయి, మళ్లీ ప్రధానిగా మోదీ పార్లమెంట్లో సృష్టమైన మెజార్టీతో గెలిచారు. దీంతో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభతరం అవుతుందని ఆయన అన్నారు. సిఐఐ భాగస్వామ్యంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనమిక్ సమ్మిట్లో విల్బర్ రాస్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో భారత ప్రధాని పర్యటించిన సమయంలో వాణిజ్యం ఒప్పందం దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీలు రాలేదు ఎందుకు? అన్ని ప్రశ్నించగా రాస్ సమాధానమిచ్చారు. ఐదు నిమిషాల్లోనే వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ఏ ప్రభుత్వం చెప్పలేదని, వాణిజ్య ఒప్పందం చర్చలు జరిగాయనేది ఊహాగానాలు మాత్రమేనని అన్నారు.













