అక్రమ రవాణా అరికట్టడంలో భారత్ విఫలం : అమెరికా
మానవ అక్రమ రవాణా కట్టడిలో భారతదేశం గత ఐదేళ్లలో ఘోరంగా విఫలం అయిందని అమెరికా అధికారిక నివేదికలో తెలిపారు. ఓ వైపు మనుష్యుల తరలింపు వ్యాపారం అయిపోయింది. కానీ ఈ కేసులలో దోషుల నిర్థారణ శాతం, విచారణ ప్రక్రియలు అంతర్జాతీయ ప్రమాణిక కొలమానానికి అనుగుణంగా లేవని నివేదికలో వెల్లడించారు. 2018 సంవత్సరానికి మనుష్యుల అక్రమ రవాణాపై అమెరికా విదేశాంగ శాఖ వార్షిక నివేదికను వెలువరించింది. మానవ రవాణా సూచీలో ఇండియా ఇప్పటికే టైర్ టూ స్థాయిలోనే ఉందని ఇందులో ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా అక్రమంగా మనుష్యుల తరలింపు జరుగుతోంది. బలవంతంగా కార్మికులుగా మార్చడం, వెట్టికి దింపడం వంటి చర్యలకు దిగుతున్నారు.













