బలమైన మిత్ర దేశం భారత్ : అమెరికా
అమెరికాకు బలమైన ప్రాంతీయ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ దేశం రూపుదిద్దుకుంటోందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అన్నారు. అందువల్ల భారత్ అప్ఘనిస్థాన్ను రాజకీయంగా, ఆర్థిక పరంగా బలోపేతం చేయగలుగుతుందని ఆయన అన్నారు. ఆఫ్గాన్పట్ల అమెరికా నూతన వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ ట్రంప్ భారత్ ప్రమేయం పెరగాలని కోరారు. అందు మీదట టిల్లర్సన్ వ్యాఖ్యానిస్తూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను బలపరచ్చడంలో భారత్ కృషిని ప్రశంసించారు. అభివృద్ధికి కూడా భారత్ సహాయపడిందని చెప్పారు. పాకిస్థాన్ ప్రవర్తన మార్చడంలో భారత్ సహాయాన్ని ఆయన కోరారు. టెర్రర్ గ్రూపులను కట్టడి చేయడంలో తన శక్తిని పాకిస్థాన్ మదింపు వేసుకోవాలని కూడా సూచించారు. పాకిస్థాన్ వ్యవహారంలో అమెరికా ఒక్కటే చేయగలిగిందేమీ లేదని చెప్పారు.













