అమెరికా, భారత్ ల మధ్య మరో కీలక ఒప్పందం
అగ్రరాజ్యం అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి ఇరు దేశాల మధ్య మరో కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్య సహకారాన్ని పెంపొందించుకోవాలన్న లక్ష్యంలో భాగంగా అమెరికా నుంచి చమురు, గ్యాస్, రక్షణ రంగ సామగ్రిని కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఏటా 5 బిలియన్ డాలర్లు (రూ.35వేల కోట్లు) విలువ చేసే చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోనుంది. 18 బిలియన్ డాలర్ల (1.26 లక్షల కోట్లు) రక్షణ సామగ్రి దిగుమతి చేసుకోనుండగా, అప్పుడే ఆ ప్రక్రియ ప్రారంభమయింది. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ శ్రింగ్లా ఇక్కడి వ్యాపార వర్గాలతో మాట్లాడుతూ అమెరికా నుంచి భారత దిగుమతులు 30 శాతం మేర పెరిగాయని తెలిపారు.













