అమెరికా చేసిన పని మనమూ చేయగలం
భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సృష్టం చేశారు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌ను 2011 లో అమెరికా దాడిచేసి ముట్టబెట్టిందని, భారత్‌కు అటువంటి సత్తా ఉందన్నారు. స్వచ్ఛగంగ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ లో మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలను చూస్తూంటే నాకో విషయం గుర్తుకొస్తోంది. అబోటాబాద్‌లోని రహస్య స్థావరంలో దాక్కొన్న లాడెన్‌ను అమెరికన్ నేవీ షీల్స్ చాకచక్యంగా మట్టుబెట్టగలిగినప్పుడు మనమెందుకు ఆ పని చేయలేం? గతంలో ఇటువంటి దాడులు కేవలం మన ఊహలకు మాత్రమే పరిమితమయ్యేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. శత్రువు ఎక్కడున్నా మట్టబెట్టే సామర్థ్యం భారత్‌కూ ఉంది అని జైట్లీ అన్నారు.













