2 +2 చర్చలు ప్రారంభం
భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ సహకారాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠాత్మక 2+2 చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ వేదికగా ఈ చర్చలు జరుగుతున్నాయి. భారత్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్తో నేడు సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, మైక్ పాంపెయా కూడా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. ఇరాన్, రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌పై పడుతున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.













