భారత్, అమెరికా చర్చలు
నియమాధారిత అంతర్జాతీయ విధానంపై కలిసి పనిచేయడానికి భారత్, అమెరికా దేశాలు ముందుకొచ్చాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సీ) అజెండాలోని సమస్యలపై రెండు రోజుల పాటు ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. అమెరికా సీనియర్ అధికారుల బృందంతో బుధ, గురు వారాల్లో చర్చలు జరిపింది. తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్, భద్రతా మండలితో పాటు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.













