అక్టోబర్ 22న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఆవిష్కరణ: మహేష్ బిగాల
భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరించనున్నారు. మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ కార్యక్రమములో ఆస్ట్రేలియాలో పాల్గొనటానికి పీవీ శత జయంతి ఉత్సవాల చైర్మన్ కేశవరావు గారిని, పీవీ కుటుంబ సభ్యులు మిగితా ప్రజా ప్రతినిధులని ఆహ్వానించడం జరిగింది. దీనిలో భాగంగా పీవీ విగ్రహాన్ని ఆస్ట్రేలియా కి పంపడం జరిగింది. ఆస్ట్రేలియా లో స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ మేయర్ మరియు కమిటీ సభ్యులు స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ సభ్యులు కార్యక్రమాల్ని అక్కడ పర్య వేక్షిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ప్రతినిధుల సహకారముతో సిడీని లోని ఓంబుష్ పార్క్ లో అక్టోబర్ 22 న 11:00 లకి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అని తరువాత పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు తెలుగు, తెలంగాణ మరియు భారత సంఘాల సహకారముతో సభను ఏర్పాటు చెయ్యనున్నారు.
ఈ సభకు మల్టీ కల్చరల్ మినిస్టర్స్, ప్రతినిధులు హాజరు కానున్నారు. భారతదేశం దాటి మొట్టమొదటి సారి పీవీ విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది. మహేష్ బిగాల గారు అక్కడ కార్యక్రమాలని పరిశీలించడానికి 10 రోజుల ముందే వెళ్లనున్నారు అని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగే కార్యక్రమ వివరాలను కేశవరావు గారితో చర్చించడం జరిగింది. ఆస్ట్రేలియా కార్యక్రమ వివరాలను మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలో వున్నా వివిధ భారత సంఘాలను అందరిని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఈ బాధ్యతలని అప్పచెప్పిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారికి, కేశవరావు గారికి మహేష్ బిగాల ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. అలాగే భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే, గతేడాది కాలంలో తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.













