శాంతి కోసం ఏమైనా చేస్తాను
మధ్యప్రాచ్యం శాంతి కోసం చేయాల్సినదంతా చేస్తానని పాలస్తీనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాలస్తీనా నాయకుడు మహమౌద్ అబ్బాస్- ట్రంప్ మధ్య బెత్లెహేంలో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య అత్యంత క్లిష్టమైనదని అన్నారు. అయినప్పటికీ శాంతి ఒప్పందం కుదరటం కోసం తాను చేయాల్సినదంతా చేస్తానని ప్రకటించారు. నెతన్యాహూ, అబ్బాస్ ఇరువురు నేతలూ తన పట్ల నమ్మకం వ్యక్తం చేశారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా గాజా, వెస్ట్బ్యాంక్లలో పాలస్తీనియన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.













