23న ట్రంప్‌తో ఇమ్రాన్ భేటీ ?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసే అవకాశం ఉందని డాన్ దిన పత్రిక కథనంలో పేర్కొంది. హౌడీ, మోదీ కార్యక్రమం తర్వాత రోజు వారు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ట్రంప్‌తో ఖాన్ జరిపే రెండు సమావేశాల్లో ఇది మొదటిది కానుంది. యూఎన్‌లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇంతకు ముందే ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. కశ్మీర్లో పరిస్థితులపై నిరంతరం దష్టి సారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.













