AAA కన్వెన్షన్ లో ఆకట్టుకున్న బిజినెస్ ఫోరం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారి మొదటి కన్వెన్షన్ లో 4 అంశాలతో నిర్వహించిన బిజినెస్ ఫోరం అందరి ప్రశంసలు అందుకొంది. మొదటగా బిజినెస్ ఫోరం కి చైర్మన్ గా ప్రసాద్ కునిశెట్టి మాట్లాడుతూ బిజినెస్ ఫోరం లో నాలుగు ముఖ్యమైన అంశాలను (టాపిక్స్) తీసుకున్నామని, వాటికోసం ఆయా రంగాలలో సిద్ధహస్తులను స్పీకర్లు గా, పెనలిస్ట్ సభ్యులు గా తీసుకొచ్చామని తెలిపారు. అదే విధం గా AAA సంస్థ బిజినెస్ చేసుకొనే వారి కోసం ABC ( AAA Business Community ) అనే విభాగం ఏర్పాటు చేసిందని, అందులో బిజినెస్ వర్గం మెంబెర్స్ గా చేరవచ్చని తెలిపారు.
మొదటగా ఫైనాన్సియల్ ప్లానింగ్ అనే అంశం పై Fortis Lux Financial కంపెనీ నుంచి శ్రీ బాలాజీ శత్రుఘ్నునన్, జాన్ సలినా, ఇతరులు మాట్లాడారు. ఈ సెషన్ కి కిషోర్ లింగమల్లు మోడరేటర్ గా వ్యవహరించారు. రెండవ అంశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇన్వెస్ట్మెంట్ అప్పోర్చునిటీస్ పై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న అంశం పై తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బా రావు చెన్నూరి, రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి అవకాశాలు పై శ్రీ ప్రవీణ్ గూడూరు మాట్లాడగా శ్రీ ప్రసాద్ కునిశెట్టి మోడరేటర్ గా వున్నారు.
3వ అంశం ఉద్యోగం నుంచి వ్యాపారం (scaling up from employment to entrepreneurship) కి మారడం – పెరగడం పై శ్రీ మధు దాసరిరాజు, శ్రీ విజయ్ రామిశెట్టి, శ్రీ ప్రకాష్ కపిల మాట్లాడగా శ్రీ ఓం ప్రకాశ్ నక్కా మోడరేటర్ గా ఉనారు. శ్రీ కృష్ణ మోహన్ అమీరినేని కోఆర్డినేట్ చేసారు.
చివరగా అమెరికా లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అనే అంశం పై శ్రీ కళ్యాణ్ విజయ్, శ్రీ సురేష్ కాగితపు, శ్రీ కుమార్ సదరం, శ్రీ రవి నిమ్మగడ్డ మాట్లాడగా, సునీత కంభలదిన్నె మోడరేటర్ గా వున్నారు.







