NATS: ఇమ్మిగ్రేషన్‌పై సెమినార్
అమెరికాలో ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇమ్మిగ్రేషన్. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులో చేయడంతో చాలామంది కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాట్స్ (NATS) సంబరాల్లో ఇమ్మిగ్రేషన్ విధానంపై ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాను బి. ఇలింద్రతో ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశాన్ని కలిగించింది.
మేనేజింగ్ అటార్నీ, బిబిఐ లా గ్రూప్, పి.సి.గా ఉన్న భాను ఇలింద్ర ఎంతోమందికి ఇమ్మిగ్రేషన్ విధానాలపై సందేహాలను తీర్చుతున్నారు. మీ ఇమ్మిగ్రేషన్ స్థితిని ఎలా కాపాడుకోవాలో, అమెరికా ప్రభుత్వ విధాన మార్పులను ఎలా పరిష్కరించుకోవాలో అన్న విషయాలను భాను బి. ఇలింద్రా తెలియజేయనున్నారు.
సెషన్ అంశాలు:
* 2025లో ఓపిటి నుండి హెచ్ 1బికి తిరస్కరణ, ఇందువల్ల ఎదురయ్యే సమస్యలను ఎలా నివారించాలి
* హెచ్ 1బి 2025 సర్వైవల్ గైడ్: సమ్మతి, బదిలీలు, అమెరికాలో నివాసం
* హెచ్ 4 ఇఎడి పై ప్రస్తుత పరిణామాల వివరణ
* గ్రీన్ కార్డ్ రిట్రోగ్రెషన్, ఇబి వెయిట్‌లిస్ట్‌లు
* తిరస్కరణ తర్వాత చట్టబద్ధంగా అమెరికాలో ఎలా ఉండాలి వంటి విషయాలపై మీరు భాను ఇలింద్రతో ప్రత్యక్ష ప్రశ్నోత్తరాలలో కార్యక్రమంలో తెలుసుకోవచ్చు.







