మిన్నెసోటా ప్రైమరీ ఎన్నికల్లో ఒమర్ విజయం
అమెరికాలోని మిన్నెసోటా హౌస్ ప్రైమరీ ఎన్నికల్లో వామపక్ష వాదులు విజయం సాధించారు. అమెరికా కాంగ్రెస్లో సభ్యురాలిగా పనిచేసిన మొట్టమొదటి సొమాలి- అమెరికన్ ఇల్ల్టాన్ ఒమర్ భారీగా ఖర్చు చేసిన డెమోక్రటిక్ అభ్యర్థిని ఓడించారు. దీంతో కొత్తతరం ప్రగతిశీల సభ్యుల విజయాల పరంపరలో తాజా గెలుపు కూడా చేరింది. జాతీయత అంశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన ప్రత్యర్థులకు ఒమర్ తన విజయంతో సమాధనం చెప్పారు. తాజా విజయం ఊపుతో నవంబర్ ఎన్నికల్లో కూడా రెండోసారి గెలుపొందాలని ఒమర్ ఆశిస్తున్నారు. ప్రైమరీ ఎన్నికల్లో కోట్లాది డాలర్లును ఖర్చు చేసిన డెమొక్రటిక్ అభ్యర్థి మెల్టన్ మియక్స, మూడో అభ్యర్థిని ఓడించారు. 2018 ప్రైమరీ ఎన్నికల్లో 48 శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఒమర్ ఈసారి 57 శాతం ఓట్లు పొందారు.
తన విజయంపై ఒమర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వ్యవస్థీకత సభ్యులు ఎల్లప్పుడూ వ్యవస్థీకత డబ్బును తిప్పికొడతారు. దాడులు ఉన్నప్పటికీ మాకు మద్దతు పెరిగింది అని పేర్కొన్నారు. 2018లో అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన మొదటి ఇద్దరు ముస్లిం మహిళల్లో 37 ఏళ్ల ఒమర్ కూడా ఒకరు. 2016లో మిన్నసోటా నుంచి తొలిసారి సొమాలియా శరణార్ధి ఎన్నిక కావడంతో ఒమర్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో పాటు ఊదారవాద విధానాలపై పోరాటంలో ఆమె వ్యవహరించిన దూకుడు, అధ్యక్షుడు ట్రంప్ వ్వవహారశైలిపై ఆమె విమర్శలు చేస్తున్నారు.













