మెరుపుదాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం?
భారత వైమానిక దళాలు ఎల్వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరపటంతో అధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు. ఈ దాడుల వల్ల 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా వేస్తున్నారు. జైషే ఉగ్రవాద సంస్థకు చెందిని బాల్కోట్ ఉగ్రవాద శిబిరం దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది నేలమట్టం అయిందంటే మతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు తమకు ఎలాంటి నష్టం జరుగలేదని పాక్ బుకాయిస్తోంది. భారత వైమానిక బ ందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్ గైడెడ్ బాంబులతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్-2000 జైట్ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.













