భారత వాయుసేనకు అమెరికా అపాచీ
అమెరికాకు చెందిన అత్యంత అధునాతనమైన అపాచీ ఎహెచ్ -64ఈ హెలికాప్టర్లు భారత వాయుసేవ అమ్ముల పొదిలో చేరాయి. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ మైమానిక కేంద్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా అపాచీ ఎహెచ్-64ఈ హెలికాప్టర్లను ప్రారంభించారు. లిథాల్ ఫైర్ పవర్ తో లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించి చేధించే సామర్థ్యం గల అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందం జరిగింది. మొత్తం 22 హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులోనే ఒప్పందం జరగ్గా, 8 హెలికాప్టర్లు భారత వాయుసేన కేంద్రానికి వచ్చాయి. మిగతా హెలికాప్టర్లు 2020లోగా అమెరికా నుంచి దశల వారీగా రానున్నాయి.













