తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి సుబ్బారావుకు ఐ స్టాండ్ ఫర్ నేషన్ అవార్డు
జాతీయ సమైక్యతకు సంబంధించి సైనికులను స్మరించుకోవడానికి ఏర్పడిన ఐ స్టాండ్ ఫర్ నేషన్ సంస్థ మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పలువురికి పురస్కారాలను ప్రకటించింది. అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి ‘తెలుగు టైమ్స్’ పత్రిక ద్వారా మీడియా సేవలందిస్తూ, తెలుగు ఎన్నారై సంఘాలను మాతృరాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా చేసేందుకు చేస్తున్న కృషిని గుర్తిస్తూ పత్రిక ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావుకు పురస్కారంను అందిస్తున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు ఇంటూరు హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్లోని తారామతి బారదరి దగ్గర ఉన్న ఆడిటోరియంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.
నేటితరంలో జాతీయ సమైక్యతను పెంపొందించడంతోపాటు, నేను నా దేశంకోసం నిలబడుతాను అన్న నినాదంతో ఏర్పడిన ఈ సంస్థ 2020 ఫిబ్రవరి 14న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి మన సైనికుల పోరాటపటిమను అందరికీ తెలియజేస్తోంది.













