చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలో నిరసన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు ప్రజలు, ఐటీ, పారిశ్రామికవేత్తలు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ అమెరికాలోని ఎడిషన్ -న్యూజెర్సీలో కోర్ట్ల్యాండ్ సెయింట్లోని అక్బర్ రెస్టారెంట్ వద్ద నిరసన చేపట్టారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు మద్దతుగా ఐయూమ్ విత్ సీబీఎన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడీపీ, ఎన్నారై జనసేన నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.













