అమెరికాలో హైదరాబాద్ యువకుడు గల్లంతు
అమెరికాలో తెలంగాణకు చెందిన 36 ఏళ్ల యువకుడు పి రాఘవేంద్ర రావు జాడ తెలియకుండా పోయింది. రాఘవేంద్ర రావు కాలిఫోర్నియాలో ఒక ఐటీ కంపెనీలో పనిచేసేందుకు 2011లో అమెరికాకు వెళ్లారు. హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన పి బంగారం తన కుమారుడు రాఘవేంద్ర యోగక్షేమాలు తెలియడం లేదని, కొడుకు ఎక్కడికి వెళ్లాతో తెలియక ఆందోళనకు చెందుతున్నామని అన్నారు. దౌత్య వర్గాల ద్వారా కుమారుడి ఆచూకీ తెలిసేలా చేయాలని ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను వేడుకున్నారు. పి బంగారు రిటైర్డ్ ఇంజనీరు. కుమారుడు కాలిఫోర్నియా నుంచి తరచూ తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడని, అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి ఆయన ఫోన్ లేదని, ఎక్కడున్నాడో పరిస్థితి ఏమిటో తెలియడం లేదని బంగారం తెలియచేసుకున్నారు. ఆన్లైన్లో కుమారుడి ఫోటోను కూడా పెట్టారు. ఆయన తప్పిపోయినట్లుగా అనుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురి అవుతున్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎన్నారై వ్యవహారాల మంత్రి కేటీఆర్‌కు కూడా కొడుకు ఆచూకీ తెలియజచేయాలని అభ్యర్థించారు. దయచేసి సాయం చేయండి, కొడుకు ఎక్కడున్నాడో తెలియడం లేదు. వెంటనే స్పందించి జాడ చెప్పండి. లేదా కనీసం ఫోన్ చేసేలా చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.













