అమెరికాలో రూ.17కోట్లు పలికిన నిజాం నగ
భారతదేశాన్ని పాలించిన పలువురు మహారాజులు, మొఘల్ పాలకులు వినియోగించిన నగలను అమెరికాకు చెందిన క్రిస్టీ సంస్థ వేలం వేసింది. ఇందులో హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబులు ధరించిన ఆభరణాలు కూడా ఉన్నాయి. వేలంలో ఈ నగలు ఊహించిన దాని కంటే ఎక్కువ ధర పలికినట్లు క్రిస్టీ సంస్థ వెల్లడించింది. నిజాం నవాబులుకు చెందిన రివిరీ డైమండ్ నక్లెస్ వేలంలో 24,15,000 డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.17 కోట్లు. 33 వజ్రాలు కలిగిన ఈ నగ 15,00,000 డాలర్లు (రూ.10.5 కోట్లు) పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. ఇక ఆర్కట్ నవాబులకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం ఆర్కట్ 2 రికార్డు స్థాయిలో 33,75,000 డాలర్లు (రూ.23.5కోట్లు) పలికింది. నిజాం కాలం నాటి కత్తి 19,35,000 డాలర్లు (రూ.13 కోట్లు) పలికింది. జైపూర్ రాజమాత ధరించిన వజ్రపు ఉంగరం రూ.4.45 కోట్లు పలికింది. సహజ ముత్యాలతో తయారుచేసిన ఐదువరుస నక్లెస్ రూ.11.8 కోట్లు పలికింది.













