యూఎస్ లో హైదరాబాద్ వాసి మృతి
హైదరాబాద్ నగరవాసి యూఎస్‌లో కన్నుమూశాడు. ఐటీ ఉద్యోగి చైతన్యరెడ్డి (36)గుంటుక అనే వ్యక్తి గుండెపోటుకు గురై హుస్టన్ నగరంలో మృతిచెందాడు. సీనియర్ సాఫ్ట్వేర్ క్యూఏ అనలిస్ట్‌గా హుస్టన్‌లోని రాయల్ టెక్నోక్రాట్స్లో చైతన్య పనిచేస్తున్నాడు. యూఎస్‌లో ఐటీ ఉద్యోగిగా అతను పదేళ్లు నుంచి పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే అతను కంపెనీ మారాడు. హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నుంచి పీజీ డిప్లామా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన చైతన్య టెక్సాస్‌లోని లామర్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అంతిమ సంస్కారాల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు స్థానిక తెలంగాణ సంస్థ మృతుడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది.













