Hyderabad House: హైదరాబాద్ హౌస్ (ఆరోరా, నేపర్ విల్లే)
భారతీయ కమ్యూనిటీలో ముఖ్యంగా తెలుగువాళ్ళకు మంచి మిత్రునిగా, తెలుగు సంఘాలకు సహాయం అందించే డోనర్‌గా వినోజ్ చనుమోలు పేరు తెచ్చుకున్నారు. ఆయన మిత్రులు శివ యార్లగడ్డ, వాసు వల్లభనేని కలిసి రెస్టారెంట్ ఇతర బిజినెస్‌లు నిర్వహిస్తున్నారు. ఇండ్ సాఫ్ట్, మాల్ ఆఫ్ ఇండియా, నవాబీ హైదరాబాద్ హౌజ్, సింప్లిసౌత్, వ్రాప్స్ ఎన్ మోర్, యూనివర్సల్ బేకరీ, మాంక్స్ వంటి వ్యాపారాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. కమ్యూనిటీకి తనవంతుగా సేవచేయడమే తమ లక్ష్యమని అంటూ, అలాగే కమ్యూనిటీకి భారతీయ రుచులను అందించాలన్న ఉద్దేశ్యంతో రెస్టారెంట్ రంగంలో ప్రవేశించినట్లు వారు చెప్పారు.
ఆరోరా, నేపర్ విల్లేలో ఉన్న భారతీయ రెస్టారెంట్లో హైదరాబాదీ వంటకాలకు చిరునామాగా హైదరాబాద్ హౌస్ (Hyderabad House) పేరుగాంచింది. వెజ్, నాన్‌వెజ్ బిర్యానీలను రుచికరంగా తయారు చేయడంలో ఈ రెస్టారెంట్ పేరుగాంచింది. హైదరాబాద్‌లో ఎలాంటి పదార్ధాలతో బిర్యానీ తయారు చేస్తారో అలాంటి పదార్థాలను తాము తెప్పించి ఇక్కడ రుచికరమైన బిర్యానీని తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
చికాగో (Chicago) ఏరియాలో ఈ రెస్టారెంట్‌ను శివ యార్లగడ్డ ఏర్పాటు చేశారు. తరువాత మేనెజ్మెంట్ నిర్వహణ బాద్యతలను చేపట్టిన వినోజ్ చనుమోలు, వంశీ వల్లభనేనిలు కలిసి ఈ రెస్టారెంట్‌ను మరింతగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు చికాగో ఏరియాలో పలు లొకేషన్స్‌లలో ఈ రెస్టారెంట్లు కనిపిస్తాయి.
వివిధ రకాల బిర్యానీలకు తోడుగా రైతా, సలాన్ (పుల్లని కూర)తో కస్టమర్లకు వారు అందిస్తారు. కూరలు, తందూరి వంటకాలు, దోసలు (దక్షిణ భారతీయ పాన్కేక్ రకం) మరియు డెజర్ట్‌లను కూడా అందిస్తుంది. చికెన్ టిక్కా మసాలా, బట్టర్ చికెన్, మసాలా దోస మరియు గులాబ్ జామున్ (తీపి భారతీయ డెజర్ట్) వంటివి ప్రసిద్ధ మెనూ వంటకాలు. డైన్-ఇన్ మరియు టేక్అవుట్ సేవలు అందిస్తున్నది డెలివరీ సేవలను కూడా ప్రదేశాన్ని బట్టి సరఫరా చేస్తోంది. భారతీయ వంటకాలతో పాటు, చైనీస్, అమెరికన్ వంటకాలను కూడా కస్టమర్లకు అందిస్తు న్నారు. హైదరాబాదీ హౌస్ దాదాపు 35కిపైగా లొకేషన్లలో సర్వీసులను అందిస్తోంది.







