టెక్సాస్ తుపానులో భారత విద్యార్థి మృతి
తుపాన్ కారణంగా వరదలు వచ్చి టెక్సాస్ అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో హ్యూస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిని అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన నిఖిల్ భాటియా, షాలిని అనే విద్యార్థులు నీటిల కొట్టుకపోతుండగా కాపాడి ఆస్పత్రిలో చేర్చించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిఖిల్ భాటియా మంగళవారం రాత్రి చనిపోయాడు. షాలిని పరిస్థితి విషమంగా ఉంది. రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ భాటియా పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన భాటియా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అమెరికాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు.













