టెక్సాస్ ను వణికించిన హన్నా హరికేన్
భారీ వర్షంతో కూడిన హన్నా హరికేన్ టెక్సాస్‌ను వణికించింది. హన్నా హరికేన్ ప్రస్తుతం బలహీనపడినప్పటికీ భారీవర్షం కారణంగా దక్షిణ టెక్సాస్, ఈశాన్య మెక్సికోలో వరదలకు దారితీసే అవకాశం అమెరికా అధికారులు హెచ్చరించారు. హరికేన్ శనివారం తీరాన్ని తాకిందని తెలిపారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ 32 కౌంటీలకు విపత్తు ప్రకటన విడదుల చేశారు. కరోనా వైరస్ అత్యవసర సేవల పనిని క్లిష్టతరం చేస్తోందని అధికారులు తెలిపారు. అయితే టెక్సాస్ తీరంలో తుపాను ఉప్పెన హెచ్చరికను ఎన్‌హెచ్‌సీ ఉపసంహరించుకుంది. హన్నాను మొదట కేటగిరీ హరికేన్‌గా వర్గీకరించారు. ఇది ఐదు దశల స్కేలులో కనిష్ఠస్థాయి. శనివారం పాడ్రే ద్వీపంలో కొండచరియలు విరిగిపడ్డాయని ఆదివారం మెక్సికోను హరికేన్ తాకిందని వాతావరణ శాఖ తెలిపింది.













