హ్యూస్టన్లో ప్రధాని మోదీకి స్వాగత బోర్డులు
సెప్టెంబర్ 22న జరిగే హౌడీ, మోడీ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీని స్వాగతిస్తూ అమెరికాలోని హ్యూస్టన్లో ప్రధాన రహదారులపై భారీ బిల్ బోర్డులు ఏర్పాటు చేశారు. భారత అమెరికన్ల ఇళ్ల ముందు రెపరెపలాడుతున్న భారత జెండాలు ఆయన రాక కోసం ఆతృతంగా ఎదురు చూస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50వేల మంది పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు హ్యూస్టన్ కేంద్రంగా పని చేస్తున్న టెక్సాస్ ఇండియా ఫోరం (టిఫ్) తెలిపింది. నైరుతి అమెరికాలో సాధారణంగా ఉపయోగించే స్నేహపూర్వక గ్రీటింగ్ ”హౌ డు యూ డు ”? ను సంక్షిప్తంగా హౌడీ గా పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుండి పోయేలా చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని కమ్యూనిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.













