హార్ట్ ఫౌండేషన్ కోసం బే ఏరియాలో 5కె రన్…పాల్గొన్న ప్రముఖులు
హృదయ క్యూర్ ఎ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ కోసం బే ఏరియాలో యువ లీడర్లు శ్రియా వేజెండ్ల, చేతన గంగ నిర్వహించిన 5కె రన్ విజయవంతమైంది. బే ఏరియాలోని పలువురు ఇందులో పాల్గొని ఫౌండేషన్‌కు తమవంతు చేయూతను అందించారు. దాదాపు 12కె డాలర్లు విరాళంగా వచ్చాయి. ఈ విరాళాలను ఇండియాలోని పేద పిల్లల హార్ట్ సర్జరీకి వినియోగించనున్నారు. బాటా నాయకులు, తానా నాయకులు ఇందులో పాల్గొన్నారు. బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి, రమేష్ కొండ, తానా నాయకులు సతీష్ వేమూరి, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.













