వైభవంగా టిసిఎ ఉగాది వేడుకలు

హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఈ వేడుకల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. పంచాంగ శ్రవణం, స్వరమాధురి, క్లాసికల్ లైట్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు. హ్యూస్టన్‍లో ని స్థానిక తెలుగు చిన్నారులు, టీనేజ్, పెద్దవాళ్ళు, శాస్త్రీయ సామాజిక, సినిమాపాటలు, నృత్యాలతో నాలుగుగంటలపాటు అందరినీ అలరించారు.
అధ్యక్షురాలు గీత ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శిరీష అక్కినేని, ట్రెజరర్ శివ, కల్చరల్ సెక్రటరీ ఆశాజ్యోతి తదితరుల సహకారంతో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. మాజీ అధ్యక్షులు రాము ఉప్పలపాటి, ట్రస్టీలు కనకంబాబు ఐనంపూడి, ఆంజనేయులు కోనేరు, వెంకట్ వీరిసెట్టి ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి తోడ్పాటును అందించారు.