డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రతినిధుల సభ నిరాకరించింది. గోడ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం అధ్యక్షుడు ట్రంప్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించటాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఓటింగ్ సందర్భంగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన 13 మంది ప్రతిపక్షంతో చేరడం గమనార్హం. దీంతో ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష డెమోక్రాట్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభ 245-182 కోట్ల భారీ తేడాతో తిరస్కరించింది. ఇక, త్వరలో అధికార రిపబ్లికన్లకు బలమున్న సెనెట్ ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి గోడకు కావాల్సిన నిధులు రాబడతామని ట్రంప్ ప్రకటించారు.













