ట్రంప్ చర్య దేశద్రోహమే….
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దేశానికి ద్రోహం చేసినందుకే ఆయన్ను అభిశంసించేందుకు సిద్ధమవుతున్నామని ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ సృష్టం చేసింది. ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియను ఆ పార్టీ సహేతుకంగా సమర్థించుకుంటూ ప్రతినిధుల సభలో ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్‌పై నమోదు చేసిన అభిశంసన అభియోగాలపై ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగనుండటంతో డెమొక్రాట్లు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశద్రోహానికి పాల్పడ్డారని, ఆయన్ను అభిశంసించటం సహేతుకమైనదేనని డెమొక్రాటిక్ పార్టీ తన ప్రకటనలో వివరించింది.













