సిగరేట్ కంటే హుక్కా డేంజర్
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్లు, బీడీలను తాగడం వల్ల కేన్సర్, మధుమేహం, హృద్రోగాలు వస్తాయి. అయితే సిగరెట్ల కంటే హుక్కా మరింత ప్రమాదకరమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్క అరగంట సేపు హుక్కా పీల్చినా గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. హుక్కా, పీల్చడానికి ముందు తర్వాత పలువురు యువకుల గుండె స్పందనల వేగం, రక్తపోటు, ధమనుల దృఢత్వం, రక్తంలోని నికోటిన్ స్థాయిలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. అరగంట సేపు హుక్కా పీల్చడం వల్ల గుండె సాధారణం కంటే 16 సార్లు ఎక్కువగా కొట్టుకుంటున్నట్లు తెలిపారు.













