అమెరికా లో ప్రధాన విద్యాసంస్థలలో ప్రారంభం కానున్న ఆన్లైన్ తరగతులు
ఈ విద్యా సంవత్సరాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలి అని అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం నుండి ఒత్తిడి పెరగటంతో వివిధ జిల్లాలోని అనేక పెద్ద విద్యాసంస్థలు బుధవారం 15 జూలై, పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు దృష్ట్య ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్లైన్ తరగతులతో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి.
న్యూయార్క్ టైమ్స్ డేటాబేస్ ప్రకారం గడిచిన 14 రోజులలో, 3,508,900 మందికి పైగా అమెరికా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు మరియు కనీసం 137,200 అమెరికా ప్రజలు కరోనావైరస్ తో మరణించారు. బుధవారం 15 జూలై ఒక్కరోజు సాయంత్రం నాటికి, అమెరికా వ్యాప్తంగా 67,000 కి పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి , కొన్ని రాష్ట్రాల సంఖ్య ఇంకా ప్రకటించాల్సి ఉంది. రానున్న రోజుల్లో కరోనా వైరస్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున అమెరికా వ్యాప్తంగా గవర్నర్లు మరియు మేయర్లు ఈ విద్యా సంవత్సరం తరగతులు ఆన్లైన్ ద్వారా ప్రారంభించేలా చూడాలి అని విద్యా సంస్థలకు సూచించారు.
అమెరికాలో ఏడవ అతిపెద్ద విద్యాసంస్థ హ్యూస్టన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ , సెప్టెంబర్ 8 నుండి ఆన్లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. విద్యార్థులకు కనీసం ఆరు వారాల ఆన్లైన్ బోధన ఉంటుంది, అక్టోబర్ 19 నాటికి వ్యక్తిగతంగా తరగతులు ప్రారంభించాలనే తాత్కాలిక ప్రణాళికను కూడా ప్రకటించింది. శాన్ ఫ్రాన్సిస్కోలో రాబోయే విద్యా సంవత్సరం దూరవిద్యతో ప్రారంభమవుతుందని మరియు క్రమంగా విద్యార్థులు తరగతి గదులు కి వచ్చే ప్రణాళికను రూపొందించనున్నట్లు విద్యా సంస్థల అధికారులు 15 జూలై న ప్రకటించారు. తల్లిదండ్రులకు పంపిన సందేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ విన్సెంట్ మాథ్యూస్ ” పెరుగుతున్న కరోనా వైరస్ దృష్ట్యా నిపుణుల సలహా మేరకు సైన్స్ మరియు డేటా విద్యార్థులకి క్రమంగా హైబ్రిడ్ విధానాన్ని (ఆన్లైన్ మరియు ఇన్-క్లాస్ కలయిక) అందించాలని నిర్ణయించాము. ఇలా చేయడం సురక్షితం” అని తెలిపారు.
కాలిఫోర్నియా లోని రెండు అతి పెద్ద ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్న జిల్లాలు లాస్ ఏంజిల్స్ మరియు శాన్ డియాగో లో ఆన్లైన్ లో విద్యా తరగతులు ప్రారంభిస్తున్నట్టు ఈ వారం మొదట్లో ఆ జిల్లా అధికారులు ప్రకటించారు ఈ రెండు జిల్లాలతో కలిపి కాలిఫోర్నియా లోని 15 జిల్లాలో 11 జిల్లాల అధికారులు మరియు విద్యాసంస్థ అధికారులు ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
అమెరికా లో ఎక్కువ విద్యాసంస్థ లు ఉన్న జిల్లా న్యూయార్క్ నగరం ఈ విద్యా సంవత్సరానికి ఇన్-క్లాసెస్ మరియు ఆన్లైన్ క్లాసెస్ సంయోగ ప్రణాళికను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.అంటే విద్యార్థులు వారానికి ఒకటి నుంచి మూడు రోజులు విద్యాలయాలకు రావలసి ఉంటుంది అని అన్నారు.
కాన్సాస్ గవర్నర్ లారా కెల్లీ మాట్లాడుతూ “కాన్సాస్లో అనేక కరోనా వైరస్ హాట్ స్పాట్లు ఉన్నాయి మరియు కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి, ఇలాంటి పరిస్థితిలో విద్యాసంస్థలు తెరవటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు” అని అన్నారు.













