నెబ్రాస్కా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో తొలిసారిగా హిందూ ప్రార్థన
నెబ్రాస్కా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో తొలిసారిగా హిందూ ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. జనవరి 29న నెబ్రాస్కా లెజిస్లేచర్ స్పీకర్, సెనెటర్ జిమ్ షీర్ తన కార్యాలయంలో హిందూ ప్రార్థన చేయాల్సిందిగా ఒమాహా హిందూ టెంపుల్లో పూజారిగా ఉన్న ప్రొఫెసర్ డా. ఫణి తేజ్ అడిదంను ఆహ్వానించారు.
1855లో ఏర్పాటైన స్పీకర్ ఛాంబర్లో హిందూ ప్రార్థన చదవడం ఇదే తొలిసారి. ఇది సనాతన ధర్మానికి లభించిన ప్రతిష్టాత్మకమైన గౌరవమని డా. ఫణితేజ్ అదిదం అంటారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన ఫణి వేదశాస్త్రాలను అధ్యయనం చేశారు. ఒమహా హిందూ టెంపుల్లో బోర్డ్ మాజీ చైర్మన్‌గా వ్యవహరించిన ఫణి ప్రీస్ట్ సేవలను కూడా వలంటరీగా అందిస్తున్నారు. సెనెటర్ నుంచి ఆహ్వానం అందినప్పుడు ఇది హిందూమతానికి లభించిన గౌరవంగా భావించానని తెలిపారు. ఛాంబర్లో ఆయన సంస్కృతంలో ఉన్న బుగ్వేదం, బృహదరణ్యక ఉపనిషత్ను చదివి వినిపించారు. తరువాత దానిని ఆయన ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసి వినిపించినప్పుడు సెనెటర్లు, స్టాప్ట్ ఆనందంగా వేదసారాన్ని అస్వాధించారని తెలిపారు. తరువాత స్పీకర్ డా. ఫణి అడిదంను గ్రేట్ సీల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నెబ్రాస్కాతో గౌరవప్రదంగా సత్కరించి, అభినందించారు.













