Hindu Fest: హిందూఫెస్ట్కు అంతా సిద్ధం
కుంభమేళా నుంచి గంగాజలం… ఇతర పుణ్య తీర్థాల సేకరణ
శ్రీశైలం, ఇతర శైవ క్షేత్రాల నుంచి పసుపు, కుంకుమ, అక్షింతల సేకరణ
తిరుపతి, ఇతర దేవుళ్ళ ఆశీర్వాదాల సామాగ్రి
అమెరికాలోని ఆధ్యాత్మికవాసుల కోసం టీవీ 5(TV5) ఛానల్ వారి ‘‘హిందూ ధర్మం యు.ఎస్.ఏ మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో జరగనున్న హిందూ ఫెస్ట్(Hindu Fest) కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాలో తెలుగు కమ్యూనిటీ నాయకులైన జయరాం కోమటి, ప్రసాద్ గారపాటి, జగదీశ్ ప్రభల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మార్చి 22వ తేదీన కొలంబస్ ఒహాయోలోని పావెల్ 2291 క్లార్క్ షా రోడ్డులోని చిన్మయ మిషన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
హిందూ ధర్మం టీవీ యు.ఎస్.ఏ మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం బృందం ఆధ్వర్యంలో శతసహస్ర లింగార్చనను నిర్వహిస్తున్నారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ లక్ష లింగార్చన జరుగుతోందని, శివలింగాలకు జరిగే పూజా కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని నిర్వాహకులు ఇండియా నుంచి రప్పిస్తున్నారు. అలాగే సహస్ర కుంకుమార్చన కూడా నిర్వహిస్తున్నారు.
పవిత్ర జలాలు, మంత్రాక్షతాలు
అమెరికాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న లక్ష లింగార్చన కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని, పవిత్ర జలాలలను, వివిధ శైవ దేవాలయాల నుంచి పసుపు, కుంకుమ ఇతర సామాగ్రిని, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి, ఇతర దేవాలయాల నుంచి మంత్రాక్షతలను, ఇతర ప్రసాదాలను నిర్వాహకులు సేకరించి అమెరికాకు తీసుకువస్తున్నారు.
లక్ష్మి గణపతి టెంపుల్ ఆలయ ట్రస్టీలు జగదీష్ ప్రభలతోపాటు నరేష్ ఇందూరి, చరణ్ ముగ్గురు కలిసి చిన్మయ మిషన్ టీమ్‌తో కలిసి ఇండియాలో పర్యటించారు. శ్రీశైలంకి వెళ్లి అక్కడ శివునికి ముడుపు ఉండటంతో వాటిని సమర్పించాము. నెల రోజులుగా ముడుపు పెట్టుకుని శ్రీశైలం పర్యటనలో శివునికి అభిషేకము అమ్మవారికి అర్చన తదితర కార్యక్రమాలు చేసి మా ముడుపులు కూడా చెల్లించాము. తరువాత శ్రీశైలంలోనే అక్కడి వేదపండితుల ఆశీర్వచనములతో చాలావరకు రుద్రాక్షలు విభూది పసుపు తర్వాత బ్యాగ్స్ తర్వాత కంకణాలు, తా కావాల్సిన డ్రై పూజ ఐటమ్స్ అన్ని కూడా సమకూర్చుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చాము. ఈ పర్యటన తరువాత నరేష్ ఇందూరి జగదీష్ ప్రభల అందరం కూడా కుంభమేళాకు కుంభమేళాలో కూడా మేము శివుడి సన్నిధానంకి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అక్కడ నుంచి కూడా కొంత పూజా సామాగ్రిని తీసుకుని, గంగాజలం తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరం తిరుపతి వెళ్ళాము.
తిరుమలకు వెళ్ళి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అక్కడ నుంచి తిరుచానూరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. టీటీడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇఓ శ్యామలరావు, జెఇఓ వెంకయ్యచౌదరి తదితరులను కలిశాము. తిరుమలలో అర్చన ఇతర కార్యక్రమాల తరువాత తిరుపతి పరిసరాల్లో ఉన్న మిగతా దేవాలయాలను కూడా దర్శించాము. స్వామివారి అక్షింతలు, ప్రసాదాలను అమెరికాకు తీసుకువెళుతున్నాము. అలాగే కాశీ నుంచి రుద్రాక్షలు రామేశ్వరం నుంచి పుట్టమన్ను తెప్పించాము. తర్వాత మధుర మీనాక్షి దేవాలయం నుంచి కూడా కుంకుమ, ఇతర వస్తువులను తెప్పించాము. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో అక్కడి దేవాలయం నుంచి కూడా పూజా సామాగ్రిని తెప్పించుకున్నాము. త్రయంబకేశ్వర్ నుంచి కూడా మంత్రజలాలు, కృష్ణ గోదావరి కావేరి నుంచి కూడా జలాలను తీసుకువచ్చాము. ఐదు జ్యోతిర్లింగాల నుంచి పూజా సామాగ్రిని తీసుకువచ్చాము. సహస్ర లింగార్చన కోసం శివలింగాల తయారీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటిదాకా 60 వేల పార్థివలింగాలు చేయించాము అమెరికాలో ఉన్న నేపాలీ బౌద్ధ సన్యాసుల బృందం కూడా మాకు సహాయం చేస్తోంది. వారు కూడా పార్థివలింగాల తయారీకోసం రెడ్ క్లే, ఆరెంజ్ క్లే ఇచ్చారు. దాంతో కూడా శివలింగాలను తయారు చేస్తున్నాము.
ఈ వేడుకకోసం హైదరాబాదులో 20 బ్యానర్లు తయారు చేయించి, పూజా సామాగ్రితోపాటు అమెరికాకు తీసుకువెళుతున్నట్లు జగదీష్ ప్రభల తెలిపారు. దాదాపు ఇప్పటికే 50 కిలోలు సామాగ్రిని అమెరికాకు పంపించడం జరుగుతోంది. అవసరమైతే మరిన్ని సామాగ్రిని కూడా అమెరికాకు తీసుకువెళుతాము. ఈ వేడుకలకు ఆర్గనైజర్లుగా జగదీశ్ ప్రభల, ప్రసాద్ గారపాటి, జయరామ్ కోమటి, అడ్వయిజర్లుగా చంద్రమౌళీ శర్మ, నరేశ్ ఇందూరి, మహేష్ తన్నీరు, తేజోవట్టి, కేశవ్ రెడ్డి, మన్నె నాగేశ్వరరావు, కో ఆర్డినేటర్లుగా శ్రీనివాస్ పండ్రంగి, సుధీర్ గడ్డం, గణేశ్ వాత్యం, రమేష్ మధు, రామచందర్ రేవూరు, టిపి రెడ్డి, రామ్ మంద, చైతన్య శర్మ, సురేష్ ముఖిరాల, సహస్ర కుంకుమార్చన కో ఆర్డినేటర్స్‌గా సుష్ ఉప్పుటూరి, పవిత్ర కోట, ఉమ మునగాల, శిరీష బుధవర్తి, మీడియా, ఆపరేషన్స్ ప్రతినిధులుగా సౌజన్య పర్నంది, రాజ బొమ్మన ఉన్నారు. ఈ పూజలను బ్రహ్మశ్రీ చంద్రమౌళీ శర్మ పర్నండి, వారి బృందం నిర్వహిస్తున్నది.
ఈ వేడుకలకు తెలుగుటైమ్స్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.
పలువురికి ఆహ్వానం
అమెరికాలో జరగనున్న వేడుకకోసం పలువురు ప్రముఖులను నిర్వాహకులు కలిసి వేడుకలకు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, గాయకుడు గంగాధరశాస్త్రి తదితరులను కలిశారు. మరికొంత మందిని కూడా కలిసి ఆహ్వానించనున్నట్లు జగదీష్ ప్రభల చెప్పారు.







