ఫేస్ బుక్ సీఈవో కావాలని ఉంది
ప్రముఖ సామాజిక మాధ్యమైన ఫేస్బుక్ సీఈవో కావాలని భావిస్తున్నానని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవాలని భావిస్తున్నానని వెల్లడించారు. హార్వాడ్ విశ్వవిద్యాలయానికి రాడ్‌క్లిఫ్ మెడల్‌ను అందుకునేందుకు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మసాచుసెట్స్‌కు చెందిన డెమోక్రటిక్ పార్టీ నేత, అటార్నీ జనరల్ మౌరా హేలీ మీరు ఏ కంపెనీకి సీఈవో కావాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా, ఫేస్బుక్ ఏదా సీనెట్లకు అని ఆమె తడుముకోకుండా చెప్పారు. ఫేస్బుక్ నుంచి ప్రపంచంలో చాలామంది వార్తలు తెలుసుకుంటారని, అవి నిజమైనవా? లేకా నకిలీవా? అన్న విషయాలను సైతం పట్టించుకోరని హిల్లరీ పేర్కొన్నారు. కాగా, నకిలీ వార్తలు, కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణాలతో ఫేస్బుక్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీ వీటి నుంచి బయటపడుతోంది. కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్స్ డాటా తస్కరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నది.













