ట్రంప్ విధానాల వల్లే చైనా దూకుడు : హిల్లరీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుపై విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ దుమ్మెతిపోశారు. విదేశీ వ్యవహారాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీరు అసంబద్ధంగా ఉందని విమర్శించారు. సరిహద్దు విషయంలో భారత్ సహ ఇతర దేశాల పట్ల చైనా అనుసరిస్తున్న దుందుడుకు చర్యల పట్ల ట్రంప్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదదన్నారు. ఆయన నిలకడలేని విధానాల ఫలితంగా భారత్ సహా పొరుగుదేశాలపై దుస్సాహసానికి ఒడిగడుతోందని ఆరోపించారు. ఇటీవల గల్వాన్ లోయ ప్రాంతంలో చైనా వ్యవహరించిన తీరు నేపథ్యంలో ఆమె స్పందించారు.













