TANA: త్వరలోనే కొత్త సినిమాతో వస్తా.. తానా 24వ కాన్ఫరెన్స్‌లో హీరో నిఖిల్
తానా 24వ కాన్ఫరెన్స్‌లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ను కూడా తానా (TANA) సత్కరించింది. హ్యాపీడేస్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడకు పోతావు చిన్నవాడా, కార్తికేయ, స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలతో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తనను ఇలా తానా 24వ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘స్వయంభు’ కోసమే తను డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నానని చెప్పారు. అలాగే ఇండియా హౌజ్, కార్తికేయ 3 కూడా త్వరలోనే వస్తాయని చెప్పారు. చాలా మంది తన కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారని, త్వరలోనే మరో సినిమాతో అందరి ముందుకూ వస్తానని చెప్పారు. తెలుగు కమ్యూనిటీ నుంచి మరింత మంది హీరోలు రావాలని అన్నారు. ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘హ్యాపీడేస్’లో కలిసి నటించిన వరుణ్ సందేశ్‌ను కూడా నిఖిల్ గుర్తుచేసుకున్నారు. యూత్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగిందని చెప్పారు. నిఖిల్ కూడా కొందరు ప్రేక్షకులను వేదికపైకి పిలిచి, ‘హ్యాపీడేస్’లోని ‘ఓ మై ఫ్రెండ్..’ పాట పాడించి అందర్నీ అలరించారు. అనంతరం తానా ఈసీ కమిటీ, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యుల కుటుంబాలు నిఖిల్‌ను సత్కరించారు.







