TANA: కార్తికేయ 2 చేసే టైంలో భయపడ్డా: తానా మహాసభల్లో హీరో నిఖిల్
తానా (TANA) 24వ మహాసభల్లో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్, స్టార్ హీరో నిఖిల్ పాల్గొన్నారు. మహాసభల మూడో రోజు ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయిన ఈ ఇద్దరూ.. పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు 22 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా ‘కాకాముట్టా’ చిత్రంలో నటించిన అనుభవాన్ని ఐశ్వర్య పంచుకున్నారు. నేరుగా స్లమ్ ఏరియాలోకి వెళ్లి, షూట్ చేసిన ఘటనలను వివరించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో తనకు నలుగురు పిల్లలని, దీనికి రెండో పార్ట్ వస్తే ఆరుగురు పిల్లలు ఉంటారని అనిల్ రావిపూడి చెప్పారంటూ జోక్ చేశారు.
అదే సమయంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2’ సినిమా చేసే సమయంలో తనకు చాలా భయమేసిందని చెప్పారు. ఆ చిత్రంలో సైన్స్, భక్తి అన్ని ఉండటంతో చాలా సన్నని బోర్డర్‌లో నటించాల్సి వచ్చిందని చెప్పారు. ఆ పాత్ర తన కెరీర్లోనే చాలా కష్టమైన రోల్ అని తెలిపారు. బ్రహ్మానందం, సత్య వంటి వారితో నటిస్తుంటే చాలా సరదాగా ఉంటుందని చెప్పారు.







