Damu: దాము గేదెల 70వ జన్మదిన సందర్భంగా రవీంద్రభారతిలో అపూర్వ ఆత్మీయ అభినందన త్వరలో..
హైదరాబాద్: భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో యువకళావాహిని ఆధ్వర్యంలో కళాపోషణలో, సమాజహిత సేవలో అగ్రగణ్యుడు దాము గేదెల 70వ జన్మదిన (సప్తతి) సందర్భంగా ఆత్మీయ అభినందన సభను ఘనంగా నిర్వహించనున్నారు. కవి పండితులలో, సామాజిక సేవకులలో అగ్రగణ్యులుగా పేరుగాంచిన ఆయన్ని ఈ సందర్భంగా సన్మానించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి తేదీ: 8-12-2025 సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రవీంద్రభారతి సమావేశమందిరం (మొదటి అంతస్తు), హైదరాబాద్ వేదిక కానుంది.
సభ విశేషాలు:
అధ్యక్షత: ‘సాంస్కృతిక బంధు’ నూరిపల్లి కొండలరావు అధ్యక్షతన ఈ వేడుక జరుగుతుంది.
పాల్గొనే ప్రముఖులు: ఈ సభకు పద్మ డా. శోభారాజు, డా. సుమన్ తల్వార్, రోజారమణి, తనికెళ్ల భరణి, తరుణ్, రామచారి, శివారెడ్డి, పేరడి గురుస్వామి మొదలగు సాహితీ, సాంస్కృతిక, నాటక, సినీరంగ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తారు.
సాంస్కృతిక కార్యక్రమం: ఈ సందర్భంగా ‘మధురగీతమంజలి’ పేరుతో దాము గేదెల జీవితంపై డాక్యుమెంటరీతో కూడిన ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు.
గాయనీ గాయకులు: డీఏ మిత్రా, పవన్ కుమార్, అఖిల, రేవతి, డి. సీత పాల్గొంటారు.
వ్యాఖ్యానం: ఎస్.వి. రామారావు
యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎం.ఏ. హమీద్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.






