NATS: నాట్స్ ఆరోగ్యం
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు టాంపాలోని టాంపా కన్వెనన్ సెంటర్‌లో‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూలై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో హెల్త్ అండ్ వెల్ నెస్ పేరుతో ఆరోగ్య కార్యక్రమాలపై కూడా కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యవసర వైద్య చికిత్సపై అవగాహనను కల్పించనున్నారు. సిపిఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుండెపోటు వచ్చినవారికి అత్యవసరంగా అందించాల్సిన ఈ చికిత్సపై అవగాహన ముఖ్యమన్న ఉద్దేశ్యంతో నిర్వాహకులు సంబరాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్యనిపుణులు దీనిపై శిక్షణను ఇవ్వనున్నారు.







