వందేళ్ల వయసు ఉన్న వాళ్లే సిగరెట్ తాగాలి!
సాధారణంగా చట్టరీత్యా మన దేశంలో పొగ తాగడానికి కనీస వయసు 18 ఏళ్లు. అమెరికాలోనూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వయసు దాటిన వాళ్లకే పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. కానీ ఒక్క హవాయి రాష్ట్రంలో మాత్రం ఈ పరిమితి 21 ఏళ్లుగా ఉంది. అయితే ఇప్పుడదే రాష్ట్రంలో ఆ పరిమితిని 100 ఏళ్లకు పెంచాలన్న కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. అక్కడి చట్ట ప్రతినిధి రిచర్డ్ క్రీగన్ ఈ బిల్లును తీసుకొచ్చారు. 2024 కల్లా మొత్తం సిగరేట్‌పై నిషేధం విధించాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే హవాయిలో సిగరేట్ అమ్మకాలకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మానవ చరిత్రలోని అత్యంత ప్రమాదకరమైనది క్రీగన్ ఈ సిగరెట్‌ను అభివర్ణిస్తున్నారు. అయితే విడతల వారీగా మొత్తం సిగరేట్‌పై నిషేధం విధిచాలని క్రీగన్ ప్రతిపాందించారు.
చట్టరీత్యా పొగతాగే వయసును వచ్చే ఏడాదికి 30 ఏళ్లకు, 2021లో 40 ఏళ్లకు, 2022లో 50 ఏళ్లకు, 2023లో 60 ఏళ్లకు, 2024లో వందేళ్లకు పెంచాలని ఆయన ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లుకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు కలగకుండా రూపొందించినట్లు క్రీగన్ సృష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













