బాల్యస్నేహాలతో ఆరోగ్యానికి మేలు
బాల్యంలో స్నేహితులతో సరదాగా గడిపితే యుక్తవయసులో ఎంత ఆరోగ్యంగా ఉంటారని పరిశోధనలో తేలింది. బాల్యంలో ఎక్కువ సమయం స్నేహితులతో ఆడుకున్న వారు 30 ఏళ్లకు వచ్చేసరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా బీపీ, బీఎంఐ(బాడి మాస్ ఇండెక్స్) సాధారణంగా ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలోని జెన్నీ కండీఫ్ ఆఫ్ టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 267 మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతేకాదు, స్నేహితులతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవని పరిశోధకులు చెప్పారు.













