తెలంగాణ గురుకులాలపై అమెరికా యూనివర్సిటీ అధ్యయనం
తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు అమెరికాకు చెందిన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ బృందం త్వరలో రాష్ట్రానికి రానున్నది. 21వ శతాబ్దానికి కావాల్సిన నైపుణ్యాలను ఎలాంటి మార్పులతో అందిస్తున్నారనే విషయాలపై ఈ బృందం అధ్యయనం చేయనున్నది. ఈ అధ్యయనం కోసం తమ ప్రొఫెసర్లు, విద్యార్థుల బృందం వస్తున్నట్టు హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ ఫెర్నాండో రీమర్స్.. సాంఘిఖ సంక్షేమ గురుకుల కార్యదర్శికి మెయిల్ ద్వారా తెలియజేశారు. గురుకుల కార్యాలయాన్ని, పాఠశాలలను సందర్శించనున్న ఈ బృందం.. ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను, విద్యార్థులు నాయకులుగా ఎదుగుతున్న క్రమాన్ని అధ్యయనం చేయనున్నది. గురుకులాలపై అధ్యయనం చేసేందుకు హార్వర్డ్ వర్సిటీ బృందం రావడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. రాష్ట్ర చరిత్రలో ఇది ఎంతో అరుదైన విషయం.
కేజీ నుంచి పీజీ మిషన్‌లో భాగంగా గురుకులాలను ఇంతటి గొప్పస్థాయికి తీసుకెళ్లేందుకు అవకావం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఈ సందర్భంగా గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.













