యూఎస్ ఇమిగ్రేషన్ పై అమెరికన్ వర్సిటీల దావా
యూఎస్ ఇమిగ్రేషన్ జారీ చేసిన మార్గదర్శకాలపై అమెరికా వర్సిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు అండగా నిలవాలని భావించాయి. ఈ మేరకు రెండు ప్రముఖ యూనివర్సిటీలు హార్వార్డ్, మసాచునెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) బోస్టన్ కోర్టులో దావా వేశాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్య అని పిటిషన్లో పేర్కొన్నాయి. మరోవైపు ట్రంప్ నూతన విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగడమే కాకుండా విదేశీ విద్యార్థులపై ఆదారపడి నడుస్తున్న ఎన్నో విద్యా సంస్థలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయని అమెరికా చట్ట సభల సభ్యులు థామ్సన్, కథ్లీన్ రైస్ ఆందోళన వ్యక్తం చేశారు.













