భారత్ కు హార్లే డేవిడ్సన్ గుడ్‌బై
అమెరికా లగ్జరీ బైక్స్ దిగ్గజం హార్లే డేవిడ్సన్ భారత్ కు గుడ్‌బై చెప్పింది. భారత్‌లో అమ్మకాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2009లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన హార్లే ఇక్కడ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు స్థానికంగా భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని చూస్తోందని పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. 2020 రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్‌లో భాగంగా సిబ్బందిని తగ్గించుకోవటం, ఇతర దేశాల్లో ఉన్న వ్యాపారాలను కుదించుకోవటం వంటి నిర్ణయాలను కంపెనీలు అమలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి హరియాణాలోని బావల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది.













