హాల్‌మార్క్ లెర్నింగ్ ల్యాబ్ కార్యక్రమాలను ప్రశంసించిన ఎంపి సిఎం చౌహాన్
విద్యార్థులకు ఉపయోగపడేలా హాల్‌మార్క్ లెర్నింగ్ ల్యాబ్స్ రూపొందించిన డాక్ట్రినాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూయార్క్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకలో హాల్‌మార్క్ లెర్నింగ్ ల్యాబ్స్ సభ్యులు జే తాళ్ళూరి, శ్రీనివాస్ సజ్జ, విశ్వనాథ్ నాయునిపాటి, పృథ్వీ చేకూరి, శ్రీకాంత్ దారపునేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌లో నాలుగైదు స్కూళ్ళలో ఈ డాక్ట్రినా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా కూడా కోరారు. విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పడేలా రూపొందించిన మై ప్రోగ్రెస్కార్డ్ డాట్ కమ్‌లో భాగంగా దీనిని కూడా రూపొందించారు. ఇందులో విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలు ఉన్నాయి. ఇతర వివరాలకు https://www.myprogresscard.com/ చూడవచ్చు.













