హెచ్ 4పై ఆందోళన వద్దు
హెచ్ 4 వీసా రద్దుపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై కార్పొరేట్లు, చట్టసభల ప్రతినిధులు ఆందోళన చెందనవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తెలిపింది. ఈ మేరకు యూఎస్సీఐఎస్ ప్రతిపాదనలు రూపొందించగానే తాము ప్రజల ముందు పెడతామన్నది. హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్లలోపు సంతానానికి హెచ్ 4 వీసా మంజూరు చేస్తారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వీలుంది. ఈ వీసా కింద ప్రస్తుతం 70 వేల మందికి పైగా భారతీయ మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నిబంధనను ఎత్తివేస్తామన్న ట్రంప్ సర్కార్, మూడుసార్లు నోటిఫికేషన్ జారీని వాయిదా వేసింది.













