విదేశీ ఉద్యోగులకు తగ్గనున్న అమెరికాపై మోజు!
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకిచ్చే హెచ్ 4 వీసా ప్రక్రియను ఒకవేళ ట్రంప్ సర్కారు రద్దు చేస్తే నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికాపై ఆకర్షణ తగ్గే ప్రమాదముందని వలసదారుల అనుకూల సంస్థ ఒకటి తన నివేదికలో పేర్కొంది. హెచ్-1బీ వీసాపై వచ్చి శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు 2015లో ఒబామా ప్రభుత్వం వీలుకల్పించింది. అయితే ఆ పాలసీని రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోంది. హెచ్ 4 వీసాతో జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం వల్ల, అదనపు ఆదాయం సమకూరడంతో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఆకర్షణీయ ప్రాంతంగా కొనసాగుతుందని, ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో ఇతర దేశాలతో అమెరికా పోటీ పడేందుకు దోహదపడుతుందని ఆ నివేదిక తెలిపింది.













