వీసా ఫీజుల పెంపునకు యూఎస్ గ్రీన్‌సిగ్నల్
నాన్ ఇమిగ్రెంట్ వీసాల ఫీజులు పెంపునకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఆమోదం తెలిపింది. పెరిగిన కొత్త ఫీజులు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా ప్రభుత్వ విభాగం ఫెడరల్ రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం.. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్సెస్ (యూఎస్సీఐఎస్) ఫీజులను సగటున 20 శాతం మేర పెంచేందుకు డీహెచ్ఎస్ అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు, నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ పిటిషన్ల కోసం వేర్వేరు ఫీజులను కొత్తగా చేర్చింది. కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో 1.2 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్రకటించాలంటూ యూఎస్ కాంగ్రెస్‌ను యూఎస్పీఐఎస్ కోరిన నేపథ్యంలో ఈ పరిణామం జరగడం గమనార్హం.













